Friday 28 December 2012

తమరికి అంత లేదు సార్!


కొంత మంది మతప్రచారం పేరుతో దానికే చెడ్డపేరు తెస్తుంటారు. ప్రస్తుతానికి మతంపేరుతో నోటికొచ్చింది మాట్లాడం ఒక ట్రెండ్. అంగూఠాఛాపులు, అంగుష్టమాత్రులు 'శాస్త్రీయ పరిశోధన' అంటూ రెచ్చిపోవడం దాని ఫలితమే! తమరి లాజిక్కులు చూస్తుంటే నవ్వాగట్లేదుసార్. మొన్నేమో వచ్చేశాడొచ్చేశాడన్నారా? ఇప్పుడేంటిసార్ ఇంకా వస్తాడంటున్నారు? వచ్చేవాడేమైనా రైలెక్కివస్తున్నాడా ఇంకా వచ్చాడో, రాలేదో చెప్పలేకపోవడానికి.

మీ 'పరిశోధన' నిజమేనని ఒక్క ఇతర హిందూబ్లాగరూ సమర్ధించనప్పుడే అర్ధమయ్యింది మీరు బోగస్ అని. మీ గొడవని ఇలా మార్చకండి. క్రితం పోస్టు రాసింది మీకు, మీ అవతార పురుషుడికి వణుక్కుంటూ కాదుసార్. ఆ చెత్త రోజూ చూడలేక. బూతుబ్లాగులుకూడా ఇంత బలపెట్టవు చదవండొహో అని. మీరూ మీరాతలునూ. అది భక్తి కాదు. వెర్రి. నేను అన్నది మిమ్మల్నేసార్. తెలుగులో రెండులైన్లు చదివి, మిమ్మల్నన్నమాటల్ని మీమతాన్నేదో అన్నట్లుగా పొరబడే అద్భుత పరిజ్ఞానంగల మీరు ఇక సంస్కృతాన్నీ, ఇంగ్లీషునీ ఏం అర్ధంచేసుకొని పరిశోధించారుసార్? ఏమా పరిశోధన!! ఎంత సొంపుగా జరిగింది!! సెన్సేషనల్ టైటిల్స్‌తో కూడలిని గుమ్మెత్తించడమేగానీ ఏమనా అర్ధం ఉందా ఆ పరిశొధనలో? కాసేపు షర్మిల, జగన్, గాలి అంటూ ఇలా వివాదాస్పదుల కరిజ్స్మా ని cash చేసుకోవడంలో పడ్డ కక్కుర్తేగానీ అది పరిశోధన? దాని పరువుతీయకండిసార్.

ఎన్నిసార్లైనా పోస్టుచెస్తానంటారా? నా విన్నపాన్ని 'వానజల్లుగా' భావిస్తాను. అది కురుస్తున్నా "లక్ష్యపెట్టం" అంటే నేనేమీ చెయ్యలేనుసార్. కానీ ఒక్కటిమాత్రం నిజంసార్ మీరూ, మీ పాండిత్యమూ, మీ లాజిక్కూ మాత్రం మాంఛి కామెడీసార్. ఒక ఇరవైయేళ్ళ తరువాత చదవండి మీక్కూడా నవ్వొస్తుంది. జనాల భయాన్నీ, బలహీనతల్ని, base emotionsనీ వాడుకోవడం మానండి. ఎదగండిసార్. రాస్తూండండి. రాసేవాటివల్ల ఎవరికైనా ఉపయోగమా లేక బ్లాగుహిట్లేనా అని ఒక్కసారి ఆలోచించుకోండి.

స్పందించారు అంటే స్పందించమాసార్. మీవీధిలోకి ఒక రౌడీ వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే మీరు స్పందించరా? మొత్తానికి జనాల స్పందన కోసమే ఇంతకు దిగజారారన్నమాట!

No comments:

Post a Comment