Friday 28 December 2012

తమరికి అంత లేదు సార్!


కొంత మంది మతప్రచారం పేరుతో దానికే చెడ్డపేరు తెస్తుంటారు. ప్రస్తుతానికి మతంపేరుతో నోటికొచ్చింది మాట్లాడం ఒక ట్రెండ్. అంగూఠాఛాపులు, అంగుష్టమాత్రులు 'శాస్త్రీయ పరిశోధన' అంటూ రెచ్చిపోవడం దాని ఫలితమే! తమరి లాజిక్కులు చూస్తుంటే నవ్వాగట్లేదుసార్. మొన్నేమో వచ్చేశాడొచ్చేశాడన్నారా? ఇప్పుడేంటిసార్ ఇంకా వస్తాడంటున్నారు? వచ్చేవాడేమైనా రైలెక్కివస్తున్నాడా ఇంకా వచ్చాడో, రాలేదో చెప్పలేకపోవడానికి.

మీ 'పరిశోధన' నిజమేనని ఒక్క ఇతర హిందూబ్లాగరూ సమర్ధించనప్పుడే అర్ధమయ్యింది మీరు బోగస్ అని. మీ గొడవని ఇలా మార్చకండి. క్రితం పోస్టు రాసింది మీకు, మీ అవతార పురుషుడికి వణుక్కుంటూ కాదుసార్. ఆ చెత్త రోజూ చూడలేక. బూతుబ్లాగులుకూడా ఇంత బలపెట్టవు చదవండొహో అని. మీరూ మీరాతలునూ. అది భక్తి కాదు. వెర్రి. నేను అన్నది మిమ్మల్నేసార్. తెలుగులో రెండులైన్లు చదివి, మిమ్మల్నన్నమాటల్ని మీమతాన్నేదో అన్నట్లుగా పొరబడే అద్భుత పరిజ్ఞానంగల మీరు ఇక సంస్కృతాన్నీ, ఇంగ్లీషునీ ఏం అర్ధంచేసుకొని పరిశోధించారుసార్? ఏమా పరిశోధన!! ఎంత సొంపుగా జరిగింది!! సెన్సేషనల్ టైటిల్స్‌తో కూడలిని గుమ్మెత్తించడమేగానీ ఏమనా అర్ధం ఉందా ఆ పరిశొధనలో? కాసేపు షర్మిల, జగన్, గాలి అంటూ ఇలా వివాదాస్పదుల కరిజ్స్మా ని cash చేసుకోవడంలో పడ్డ కక్కుర్తేగానీ అది పరిశోధన? దాని పరువుతీయకండిసార్.

ఎన్నిసార్లైనా పోస్టుచెస్తానంటారా? నా విన్నపాన్ని 'వానజల్లుగా' భావిస్తాను. అది కురుస్తున్నా "లక్ష్యపెట్టం" అంటే నేనేమీ చెయ్యలేనుసార్. కానీ ఒక్కటిమాత్రం నిజంసార్ మీరూ, మీ పాండిత్యమూ, మీ లాజిక్కూ మాత్రం మాంఛి కామెడీసార్. ఒక ఇరవైయేళ్ళ తరువాత చదవండి మీక్కూడా నవ్వొస్తుంది. జనాల భయాన్నీ, బలహీనతల్ని, base emotionsనీ వాడుకోవడం మానండి. ఎదగండిసార్. రాస్తూండండి. రాసేవాటివల్ల ఎవరికైనా ఉపయోగమా లేక బ్లాగుహిట్లేనా అని ఒక్కసారి ఆలోచించుకోండి.

స్పందించారు అంటే స్పందించమాసార్. మీవీధిలోకి ఒక రౌడీ వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే మీరు స్పందించరా? మొత్తానికి జనాల స్పందన కోసమే ఇంతకు దిగజారారన్నమాట!

Thursday 27 December 2012

వీరభోగ వసంతరాయలు - ఒక పరిశోధన

నిన్న నేను గుఱ్ఱానికి పళ్ళుతోముతున్నప్పుడు, రెండు మూళ్ళు ఆరుకాదేమో, ఏడేమోనని ఒక సందేహం వచ్చింది. మరదే నిజమైతే ఏడు సరిసంఖ్య కావాలికదా! అలా కాదుకాబట్టి రెండూమూళ్ళు ఆరేనని సమాధాన పడ్డాను.

అలాగే మొన్న పందులకు పసుపు రాస్తున్నప్పుడు, ఏదైనా మనిషికిమాత్రమే ఉండి, జంతువుకి లేకపోతే అది ఖచ్చితంగా గొప్పదైఉండాలని తలపోశాను. మరింకేం! మద్యపానం అనే అలవాటు నిష్షందేహంగా గొప్పది! కాబట్టి తాగుడు అలవాటులేకపోతే మనిషికాదన్నమాట.

ఇంకోసారిలాగే తిన్నదరక్క దొర్లుతున్నప్పుడు, పరిశోధించి, వీరభోగ వసంతరాయలు ఆకాశమార్గాన లటుక్కున ఊడిపడతాడని డిసైడుచేసేశాను ఐ మీన్ పరిశోధించాను. ఆతరువాత ఒబామానే వీరభోగ వసంతరాయలని కనిపెట్టేశాను. నేను ఇప్పుడు WIFI వాడుతున్నాను. అంటే వీరభోగ వసంతరాయలు గూర్చిన వార్త మిమ్మల్ని ఆకాశమార్గాన వచ్చిచేరిందన్నమాట. అదేకదా నేనుకూడా చెప్పింది. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే వేరే ఎవరో ఇంకెప్పుడో ఎలా ఎప్పుడూ వస్తాడో చెప్పేస్తారు.

నేను కనుక్కున్న ఈ గొప్పముప్పాతిక విషయాలను మీరు వంటబట్టించుకొనేదాకా రోజుకోసారి దీని లింకును పోస్టుచేస్తుంటాను. ఏం? టీవీల్లో అన్నేసిసార్లు వాణిజ్యప్రకటనలు చూడ్డానికిలేని బాధ నా ఒక్కబ్లాగుచూడమంటే వచ్చిందా?

మతం గురించైతే ఏ చెత్తరాసినా ఎవడూ 'ఏంది?' అడగడు. ఒకవేళ అడిగితే పరిశోధనని ఓండ్రపెట్టవచ్చు. అదే సైన్సైతేనా బోలెడు వివరణలు, ఋజువులు ఇవ్వాలి. కాబట్టి నాకున్న వేలిముద్రజ్ఞానంతో మీకు సైన్సు ఏవిధంగా ప్రమాదకరమో వివరిస్తానికమీదట. అన్నట్లు నా గత పరిశోధనతో మిమ్మల్ని విజవంతంగా బురిడీ కొట్టించానుకాబట్టి నా బ్లాగుపేరుని 'గాడిద పగ్గం'గా మారుస్తున్నాను.

Wednesday 10 October 2012

నా ఉద్దేశ్యం


నా గురించి ఎవరో ఏదో చెబితే మీరు తెలుసుకోవడమే తప్ప. నేను నా తత్వం మీకిప్పటివరకూ తెలియదు. నన్ను తెలుసుకోవాలని ఇప్పటివరకూ మీరుచేసిన ప్రయత్నం ఏనుగు-గుడ్డివాళ్లను తలపించేదిలానే ఉంది తప్ప ఎవ్వరూ దగ్గరకు రాలేకపోయారని నాకిప్పుడు అనిపిస్తుంది.

నెనున్నానని కొందరు, లేనని కొందరు ఇప్పటివరకూ చేసిన రభస చాలు. ఉంటే ఎలా ఉన్నాను? నా తత్వమేంటి అని చెప్పినవారినీ, లేను లేనని అంటూనే నాకింకో రూపునిచ్చెవారినీ ఇక చాలించేలా చెయ్యాలనే ఇలా మీముందుకు రావడం.

తెలుసుకుంటారో, అదే మూర్ఖత్వంలో మునిగిఉంటామంటారో మీ ఇష్టం.