Thursday 27 December 2012

వీరభోగ వసంతరాయలు - ఒక పరిశోధన

నిన్న నేను గుఱ్ఱానికి పళ్ళుతోముతున్నప్పుడు, రెండు మూళ్ళు ఆరుకాదేమో, ఏడేమోనని ఒక సందేహం వచ్చింది. మరదే నిజమైతే ఏడు సరిసంఖ్య కావాలికదా! అలా కాదుకాబట్టి రెండూమూళ్ళు ఆరేనని సమాధాన పడ్డాను.

అలాగే మొన్న పందులకు పసుపు రాస్తున్నప్పుడు, ఏదైనా మనిషికిమాత్రమే ఉండి, జంతువుకి లేకపోతే అది ఖచ్చితంగా గొప్పదైఉండాలని తలపోశాను. మరింకేం! మద్యపానం అనే అలవాటు నిష్షందేహంగా గొప్పది! కాబట్టి తాగుడు అలవాటులేకపోతే మనిషికాదన్నమాట.

ఇంకోసారిలాగే తిన్నదరక్క దొర్లుతున్నప్పుడు, పరిశోధించి, వీరభోగ వసంతరాయలు ఆకాశమార్గాన లటుక్కున ఊడిపడతాడని డిసైడుచేసేశాను ఐ మీన్ పరిశోధించాను. ఆతరువాత ఒబామానే వీరభోగ వసంతరాయలని కనిపెట్టేశాను. నేను ఇప్పుడు WIFI వాడుతున్నాను. అంటే వీరభోగ వసంతరాయలు గూర్చిన వార్త మిమ్మల్ని ఆకాశమార్గాన వచ్చిచేరిందన్నమాట. అదేకదా నేనుకూడా చెప్పింది. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే వేరే ఎవరో ఇంకెప్పుడో ఎలా ఎప్పుడూ వస్తాడో చెప్పేస్తారు.

నేను కనుక్కున్న ఈ గొప్పముప్పాతిక విషయాలను మీరు వంటబట్టించుకొనేదాకా రోజుకోసారి దీని లింకును పోస్టుచేస్తుంటాను. ఏం? టీవీల్లో అన్నేసిసార్లు వాణిజ్యప్రకటనలు చూడ్డానికిలేని బాధ నా ఒక్కబ్లాగుచూడమంటే వచ్చిందా?

మతం గురించైతే ఏ చెత్తరాసినా ఎవడూ 'ఏంది?' అడగడు. ఒకవేళ అడిగితే పరిశోధనని ఓండ్రపెట్టవచ్చు. అదే సైన్సైతేనా బోలెడు వివరణలు, ఋజువులు ఇవ్వాలి. కాబట్టి నాకున్న వేలిముద్రజ్ఞానంతో మీకు సైన్సు ఏవిధంగా ప్రమాదకరమో వివరిస్తానికమీదట. అన్నట్లు నా గత పరిశోధనతో మిమ్మల్ని విజవంతంగా బురిడీ కొట్టించానుకాబట్టి నా బ్లాగుపేరుని 'గాడిద పగ్గం'గా మారుస్తున్నాను.

2 comments:

  1. మొత్తానికి ఎవరొ కాని, గుర్రాలకు పళ్లు తోమే వారిని, పందులకు పసుపు రాసె వారిని సైతమ్ ఆలోచింప చెశాడన్న మాట!ఎవరొ మత అజ్ణాని (కాసెపు అనుకుందాం), రాసిన దాన్ని తిరిగి, తిరిగి ఆలోచిస్తున్నారు అంటే, సైన్స్ వాళ్ళ సెన్స్ కూడ దొబ్బిందన్న మాటే! హా హా.........ఇంతకి వీరబోగవసంతరాయలు అంటే ఏమీటి?

    ReplyDelete
  2. రాసినవాడెంత మోసగాడో చెప్పడానికి ఇది రాయబడిందేకానీ మిగిలినవాళ్ళు బుఱ్ఱ చెడగొట్టుకున్నారని చెప్పడానిక్కాదు (మీసంగతి నాకు తెలీదు).

    అంటే ఏమిటో నాకు తెలీదు. ఇలాంటి చెత్త నమ్మమని ఎలా చెబుతారో అసలు జనాలకు.

    ReplyDelete